Saturday, April 03, 2010

ఎన్నారై తెలుగొళ్ల గొప్పలు - III (NRI Telugu people-III)

NRI Telugu People Part-III

మొదటి భాగంకి ఇక్కడ క్లిక్ చెయ్యండి
రెండవ భాగం కొరకు ఇక్కడ చూడండి

తెలుగు సంస్కృతి ని విదేశాలలో కాపాడడానికి తెలుగు సంఘాలను పెట్టె మహారాజులు, తెలుగు సంస్కృతి ని ఆంధ్రదేశంలో నే బ్రష్టు పట్టిస్తున్న రాజకీయనాయకుల కోసం ప్రాకూలాడడం, తెలుగు వార్షిక సదస్సులకి వారిని పిలవడం - ఇదంతా, విదేశీ తెలుగొడి స్వదేశీ ట్రేడ్‌మార్క్ రాజకీయం.

"మమ్మలిని తక్కువగా జమకట్టద్దు, చిరంజీవిని పాలకొల్లు లో మట్టికరిపిచింది మేమే" అని వాషింగ్టన్ డి సీ లొ ఉన్న ఒక గుప్తా గారు ఒకింత గర్వంగా చెప్పుకున్నారుట.

అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లో, ఏళ్ల తరబడి గేంగీస్ ఖాన్ లెక్కన అక్కడి ఇమ్మిగ్రేషన్ వ్యవస్తతో యుద్దం చేసి చివరకి సంతోషంగా అవకాశం వచ్చిన వెంటనే, భారత సిటిజెన్షిప్ వదిలేసుకుని, ఆ తర్వాత అక్కడ తిన్నది అరగక "తెలంగాణా కి అన్యాయం జరిగి పోతోంది అని, సమైక్యాంధ్ర కావాలని", శాన్‌ఫ్రన్‌సికో లోను, లండన్ లోను లేక సిడ్నీ లోను - సదస్సులు పెట్టి, స్టేట్మెంట్స్ ఇవ్వడం ఆంధ్రదేశంలో రోజూ బ్రతుకే యుద్దంగా ఉండే సామాన్యుల జీవితాలతో ఆడుకోవడం చాలామందికి ఒకరకమైన వ్యాపారమే.

అప్పటివరకు ఎంతో క్లోస్ గా ఉన్న రెండు ఫ్యామిలీస్, మూడవ తెలుగు ఫ్యామిలీ ఆ వూళ్లోకి రాగానే, కులం లేక ప్రాంతీయత కారణంగా విదేశాలలో ఎక్కడ ఉన్న - ఆంధ్రదేశం లో మాదిరిగా తప్పకుండా విడిపోకవడం అనేది, సూర్యుడు పడమటిన ఉదయీంచడు అన్నంత సత్యం

ఆంధ్రప్రదేశ్ ఎలెక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయి అని, వేల డాలర్స్ పందాలు వేసుకొని, కోడి పందాలు లేని కొరతని "దూల" ని తీర్చుకొంటారు.

తెలుగు సంస్కృతిని, భాషని కాపాడు కొంటున్నామని "తెలుగు న్యూస్ పేపర్ లలో", "ఇంటెర్నెట్" లో వీర అమ్ముడు అమ్ముకొనే చాలామంది తమ సొంత ఇంట్లో తమ పిల్లలచేత తెలుగులో మాట్లడించలేరు అనేది జగమెరిగిన సత్యం.

కనీసం 20 సంవత్సరాల వరకు ఇండియాలో పెరిగి, అమెరికా లేక బ్రిటన్ లో కేవలం ఒక సంవత్సరం క్రితం చదువుకోడా నికి వెళ్ళి, సెలవలకి కొన్ని నెలలు ఇండియా వచ్చి, "డర్టీ ఇండియా" అని అప్పడి దాకా ఇండియా మొఖం చూడనట్టు హైదరాబాద్ ఏర్‌పోర్ట్ బయటకి రాగానే మొదటి మాటగా చెప్పే అందగాళ్లు, అందగత్తె లు విదేశాలలో అంతకన్నా "డర్టీ" గా ఒక అపార్మెంట్‌లో 5 నుండి 10 మంది దాకా "డర్టీ"ఎరీయాస్ లో బ్రతుకుతారు.

తెలుగు బాష లో, ఆంధ్రదేశం లో మరుగున పడిపోతున్నాయి అని అనుకొన్న "బూతులు" ముఖ్యం గా, కులాలని ప్రాంతాలని తిడుతూ, మనకు మన సంస్కృతి కి చిహ్నం గా, ఇంటెర్నెట్ లో కొన్ని తెలుగు వెబ్‌సైట్స్ లోకి వెళితే మనం చదివి సిగ్గు (లేక) ఆనంద పడవచ్చు. ఈ సంస్కృతిని కాపాడానికి ప్రవాసాంధ్ర సోదరులు నిత్యం కృషి చేస్తారు.

కేరళ వెళితె, కొబ్బరికాయలు చవక అని, పది కొబ్బరికాయలు కొండానికి ఎవ్వడు, విజయవాడ నుండి వెళ్లాడు - కానీ, 5 డాల్లర్స్ క్యుపన్ ఉందని, 4 గాలన్స్ పెట్రోల్ ఖర్చు చేసి, 20 మైల్స్ వెళ్ళి 5 డాల్లర్స్ సేవ్ చేశాం అని ఆత్మానందం చెందే పిసినారులు కుప్పలుగా విదేశాలలో కనబడతారు.

తానా (TANA) అంటే తనవాళ్ళకి అని, ఆటా (ATA) అంటే అటుపక్క వాళ్ళకని అమెరికాలో ఉన్న తెలుగొళ్ళ అందరికి తెలిసిన చిదంబర రహస్యం

తెలుగులో ఒక్క తెలుగు ముక్క కూడా మాట్లాడడం రాని, ఇప్పటి తెలుగు సినిమా హెరాయిన్స్ (Heroines) తెలుగు సంస్కృతిని ఉద్దరించడాని అని ఆన్యూవల్ సెలెబ్రేషన్స్ పేరుచెప్పి పిలవడం, మనం డబ్బులు కట్టి అంతదూరం వెళ్ళి చెవిలో పువ్వులు పెట్టించుకోవడం కాక మరేముంటుంది

ముఖ్యంగా అమెరికా మరియు బ్రిటన్ లో ఉన్న ప్రతి తెలుగోడికి, ఆంధ్రదేశం లో పోలికల్ పవర్ ఉందని అమ్ముకోవడం ఒక విధమైన "బ్రాండింగ్" లేక "పబ్లిసిటీ" పెంచుకొనే హాబీ.

No comments: