"నాలుగేళ్లగా హెచ్-1, వీసా కోసం కుస్తీ పడుతున్న ఒక హైటెక్ ఇంజినియర్ గారి భార్యామణి అమెరికాలో పాతిక సంవత్సరాలుగా ఉన్న తెలుగు-అమెరికన్ ఆంటీ తో "మా టింకూ కి సంస్కృతం మరియి హిందూ-ఇజమ్ గురించి పాటాలు చెప్పిస్తున్నాం. మన సంస్కృతిని పిల్లలకు చెప్పలిసిన భాద్యత మనకు చాలా ఉంది కదండి" అని అంది. ఒక్క నిమిషం ఆగి, "నీకు సంస్కృతం వచ్చునా" అని తెలుగు-అమెరికన్ ఆంటీ అడిగిన ప్రశ్నకు, ఇంజినియర్ గారి భార్యామణి నుండి సమాధానం రాలేదు
సాదా సీదాగా తెలుగు ఫంక్షన్ కి వచ్చిన ఒక తెలుగు అడపడుచిని "మీ ఆయన హెచ్-1 మీద ఉన్నారా" అని అప్పుడే గ్రీన్ కార్డ్ తెచ్చుకొన్న ఇంకో తెలుగింటి అడపడుచు కొంచం జాలిగానే అడిగింది
"మేము అమెరికాలో పర్మనెంటుగా ఉండానికి రాలేదు" ఇది పర్మనెంటు వీసా (అదేనండి, గ్రీన్ కార్డ్) లేని ప్రతి తెలుగోడు చెప్పే డైలాగు
"మాకు అమెరికాలో నచ్చలేదు, అందుకనే ఇండియా వెళ్లిపోదామని అనుకొంటున్నాం" ఇది పర్మనెంటు వీసా (అదేనండి, గ్రీన్ కార్డ్) రాని, ఐ ఎన్ ఎస్ (ఇన్స్) తో యుద్దం చేసి ఓడిపొయిన తెలుగోడు చెప్పే, బహుశా నమ్మ లేని నిజం
"మీ ఆయనకి ఎంత కే" [అంటే స్యాలరీ అన్నమాట, కొవ్వు అని అనుకోకండి]
"మా ఆయనే తన కంపనీ లో, అమాటకి వస్తే అమెరికాలో నే టాప్ టెక్" అని గొప్పలు చెప్పని తెలుగింటి భర్యామణులు అరుదుగా దర్శనమిస్తారు.
"మీకిద్దరు అమ్మాయిలే గదా, మరి వాళ్ళు అమెరికాలో పెరిగితే పాడయ్యి పోరా" అని పొరాంబోకు ప్రశ్న వేసి, తన ఇద్దరు కూతుళ్ళని అమెరికాలో పెంచడానికి, గ్రీన్ కార్డ్ వచ్చాక ఫిక్స్ అయ్యీపోయింది మరొక తెలుగింటి భామ
"మా పిల్లలు టాప్ స్కూల్ చదువుతున్నారు" అని ఐదు లేక ఆరో క్లాసులు చదువుతున్న తమ పిల్లల గొప్పలకి పోని తెలుగు కుటుంబాలు చాలా అరుదుగా కనబడతాయి
"ఈ ఏరియాలో స్కూల్స్ సిటీ లోకే బెస్ట్ అని 450000 డాల్లర్స్ మార్ట్‌గేజ్ తీసుకుని మరీ ఇక్కడకి మూవ్ అయ్యమని" గప్పగా చెప్పే, మున్సిపల్ లేక జిల్లా పరిషత్ బళ్లలో తెలుగు మీడియం లో వెలగబెట్టి అమెరికా వచ్చిన తండ్రులు కుప్పలుగా కనబడతారు
లీమన్ బ్రదర్స్ లెక్కన లీవరేజ్ చేసి, అటు అమెరికాలో ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ఎడా పెడ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేసి, పెళ్లాని తిల్లలేక, అటు అలన్ గ్రీన్‌స్ప్యాన్, బెన్ బెర్నంకే లని, ఇటు తెలంగాని తిట్టుకొంటూ - మంచిరోజుల కోసం జీవించే తెలుగు ఆశావాదులు పుష్కలంగా అమెరికాలో ఎక్కడకి వెళ్ళిన కనబడతారు
"ఈ స్కూల్ కి పెద్ద ట్ర్యాక్ రెకార్డ్ లేదని, మా పిల్లలని చేరిపించలేదు" అని పిలిచిన వాళ్ళ ఇంటికి వచ్చి, కమ్మగా భోజనం చేసి, వాళ్ల పిల్లల స్కూల్ గురించి తియ్యగా చెప్పే మాట
"విండొస్7 (Windows7) ని నేనే టెస్ట్ చేసి పాస్ చేశాను" అని 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియెన్స్ తో ఒక ఇండియన్ ఐ టీ కంపనీ ద్వారా సియటెల్ లో ఒక సంవత్సరం పనిచేసి వచ్చిన ఒక తెలుగు ఐ టీ వీరుని బుల్లి అమ్ముడు
టైటల్ ఇచ్చారు గాని రోలే ఇవ్వలేదు" అని అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గా ఒక పేరున్న కంపెనీలో పనిమానేసి ఇంట్లో కూర్చున్న వాళ్ళాయన గురించి తన ఫ్రెండ్ తో చెప్పే నమ్మలేని నిజం.
"డబ్బులు ఖర్చయ్యిపోతాయని, మొగుళ్ళని కొంపలో హెల్త్ రీసన్స్ చెప్పి తాగనియ్యక, బయట పార్టీస్ లో ఫ్రీగా మందు దొరికితే పట్టించుకోని, లేక మందు కొట్టడానికి వేరేవాళ్ల ఇళ్ళకీ పంపే భార్యమణులు, ఎక్కడైనా కనబడతారు.
No comments:
Post a Comment