Saturday, March 27, 2010

ఎన్నారై తెలుగొళ్ల గొప్పలు - II

ఇది రెండవ భాగం. మొదటి భాగంకి ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఫేక్ సీవీలు పెట్టడంలో భారతదేశం మొత్తంలోనే తమకొక విశిష్టస్తానం సంపాదించుకొని, చెన్నై అమెరికన్ కాన్సులేట్క్ కి పరీక్షలు, ముప్పు తిప్పలు పెట్టి, అమెరికా వీసాలు సంపాదించుకొని - ఇప్పుడు అమేరికలో కూర్చుని భారతదేశం, అందునా ఆంధ్రదేశంలోని 'కరప్షన్' గురుంచి గంటల తరబడి ఉప్న్యాసాలు దంచే జాతి తెలుగు పెద్దలు మనకి ప్రతి పార్టీ లో కనబడతారు

మా ఆవిడ కేవలం బ్రిటిష్ ఏర్‌వేస్ లోనే ప్రయాణం చేస్తుంది, గల్ఫ్ ఫ్లైట్స్ లో అస్సలు వెళ్ళదు" అని చెప్పే మాగమహారాజ్ గొప్పలు మనం తరచూ వింటుంటాం

పిలిచి రెస్టారెంట్ లో పార్టీ ఇస్తే, శుభ్రంగా తినేసి, తర్వాత దగ్గర్లో ఉన్న ఇంకో రెస్టారంట్ ఇంకా చాలా బాగుంటుంది అని మొహమాటం లేకుండా చెప్పే స్నేహితులు మనకి కనబడుతూ ఉంటారు. 
  
మన పెద్దలు చెప్పిన గొప్ప సూక్తి 'మనకి ముందు చూపు ఉండాలి అని'. అలాగే తరచూ చెప్పే ఇంకో సూక్తి 'అప్పుడప్పుడు, వెనక చూపుకూడా ఉండాలాలని'. కానీ మనం విదేశాలలో అందునా మన తెలుగొళ్లు ఉన్నచోట ఉన్నాట్లైతే మనకి 'పక్క చూపు కూడా చాలా ఉండాలి'. మనవాళ్ళె కదా అని పక్కోళ్ళ మీద కాస్త కొన్నేయ్యక పోతే, మనకి బొక్క పెట్టేది ముందుగా మనొళ్ళె. 

ఇండియా వెళ్ళడానికి మనం ఎంత తక్కువు గా టికెట్ కొన్నామని అనుకున్నా, మనకన్నా కనీసం 50 డాల్లర్స్ తక్కువగా తాము కొన్నామనో లేక, మనకెవ్వరకి అప్పటివరకు తెలియని ఇంకో తెలుగోడు అదేరోజు అదే ఫ్లైట్ లేకపోతే ఇంకో ఫ్లైట్క్ కొ కొన్నట్లు చెప్పి, మన మనశాంతి కరువు చేసే స్నేహితులు తప్పకుండా మనకి ఉండి తీరాలి

ఇంట్లో జరుగుతున్న ఒక ఫంక్షన్ కోసం వాల్‌మార్ట్ లేక టెస్కొ లొనో అరడజను కుర్చీలు, ఒక మ్యూసిక్ సిస్టమ్ ముందురోజు కొని - ఫంక్షన్ అయ్యీపోగానే, అన్ని తిరిగి రిటర్న్ చేసి, డబ్బులు తీసుకొనే అద్భుతమయిన తెలివితేటలకి పేటెంట్ మన తెలుగోడిధే

వీసా లేకుండా, అమెరికాలో, గుల్ఫ్‌లో లేక ఇంగ్లాండ్ లొనో, ఏళ్ల తరబడి ఇల్లీగల్ గా ఉండిపోయి - అమ్నెస్టీ వస్తుందన్న ఒకేఒక్క ఆశతో, తాను పని వత్తిడుల వలన ఇండియా రాలేక పోతున్నానని తల్లితండ్రుల చెవిలో పువ్వులు పెట్టె పుత్రరత్నాలు మనకు తగులుతుంటారు.  

ఆంధ్రదేశంలో పుట్టిన వాసనలు వదల్లెక, అమెరికా కి వచ్చి కూడా తెలుగు (కుల) సంఘాల పేరుతో, ఆంధ్ర (ప్రాంతీయ) సంఘాల పేరుతో, తెలుగొళ్ల మధ్య చిచ్చు పెట్టి, కొట్టుకోవడానికు కూడా సిద్దమయ్యే మన జాతి పక్షులు, అమెరికా, ఆస్ట్రేలియ, గ్రేట్ బ్రిటన్ లో, 'రెసీసం' గురించి మాట్లాడడం, "గురువింద గింజ కింద నులుపెరగదు" అన్న తెలుగు నానుడి లెక్కనే ఉంటుంది.

ఆంధ్రదేశంలో డబ్బులు బాగా సంపాదించుకోవడానికి అవకాశం ఉన్న ప్రతి చోట, మనకి ఒకటికి పది బీసినెస్సులు - ఇంటర్మీడియేట్ మరియు ఎంసెట్ కోచింగ్ కాలేజీలు, గుళ్ళు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, హాస్పిటల్స్ ఇలా ఎన్నో కనపడ్డట్టే, అమెరికాలో - ప్రతి నగరంలో కనీసం రెండు ఆపైనే, అలాగే ఇంగ్లాండ్ లో ఒక పది తెలుగు సంఘాలు - తెలుగు వాళ్ళని ఉద్దరించడానికి కనబడతాయి.

ఆంధ్రదేశంలో వయసు మీద పడి ఒంటరిగా ఉన్న తల్లితండ్రుల ఆరోగ్యంకన్నా, తమ అభిమాన నటుడు పెట్టిన రాజకీయ పార్టీ ఆరోగ్యం గురించి నిరంతరం ఆలోచించి, గుళ్లు గోపురళ్ళాలలో పూజలు చేస్తూ వందల కొద్ది డాలర్స్ ని మంచినీళ్లలా ఖర్చుచేసే వీరాభిమానులు అన్ని దేశాలలో మనకు ప్రత్యక్షంగా కనబడతారు.

తమ అభిమాన నటుడు సినిమా విజయవంతం కావాలని, తమ అభిమాని కాని నటుడు సినిమా విజయవంతం కాకూడని, ఆంధ్రదేశంలో 'నెల' లేక 'బెంచీ' టికెట్స్ కొని, సినిమా హళ్ళలొను, సినిమా హళ్ళ బయట చిన్నపుడు చూసి 'ఛ' అని అనుకొన్నవెర్రివెషాలు వేస్తూ దాదాపు అన్ని దేశాల్లోనూ నేలబారు జనాలు లేని లోటుని తీరుస్తారు.

No comments: